
ముఖ్యంగా కౌంటింగ్ కోసం సుమారుగా 700 మంది సిబ్బందిని కేటాయించి ఉదయం 6 గంటలకు ఏలూరు సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే అధికారుల ముందర స్ట్రాంగ్ రూమ్లో సీల్ తెరిపించారట. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ 458 మంది ఉద్యోగులకు అవకాశం కల్పించారు. ఇందులో 243 మంది వినియోగించగా ఇందులో 201 చెల్లిన 42 చల్లని ఓట్లుగా ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది.
అలా పేరభత్తుల రాజశేఖర్ మొదటి రౌండ్లో 10,705 ఓట్ల ఆదిత్యాన్ని అందుకున్నారట. అలా మొదటి రౌండ్లోని 28 టేబుల్ లకు 28 వేల ఓట్లను సైతం లెక్కించినట్లు తెలుస్తోంది. ఇక రాజశేఖర్ ప్రత్యర్థి అయిన వీరరాఘవులకు 5,815 ఓట్ల సైతం వచ్చాయి.. అలాగే జీవి సుందర్ కు 1968 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది ఇతరులకు 1281.. అలాగే చల్లని ఓట్లే 2416 ఉన్నాయట. నిన్నటి రోజున ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ రాత్రి 8 గంటల వరకు ఓట్లు లెక్కింపు ప్రారంభం కాలేదట. ఓట్లు విభజించి కట్టలు కట్టెందుకు సిబ్బందికి సుమారుగా 12 గంటల పాటు సమయం పట్టిందట. ఉభయగోదావరి జిల్లాలో సుమారుగా 2,18,902 ఓట్లు ఉన్నాయని ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగడం కొంతమేరకు ఆలస్యంగా ఉన్నదట. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కూడా చాలా సేపు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయట.