
ఈ కనెక్షన్లకు ఇళ్ల కనెక్షన్లను యాడ్ చేస్తే దాదాపుగా 70 వేల విద్యుత్ కనెక్షన్లను ఇచ్చినట్టు అవుతుందని సమాచారం అందుతోంది. అసెంబ్లీ వేదికగా కూటమి సర్కార్ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి ఈ ప్రకటన చేయడం జరిగింది. స్తంభాలు, ట్రాన్స్ మిషన్ లైన్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడంతో ధరల వ్యత్యాసం ఏర్పడిన విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని కూటమి సర్కార్ చెబుతోంది.
పగటిపూటే రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పీఎం కుసుమ్ స్కీమ్ ద్వారా 9 గంటల నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా అందిస్తామని మంత్రి కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో కొత్తగా 4.5 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు అవసరం అని అంచనా వేయడంతో పాటు ఇప్పటికే లక్ష పీఎం కనెక్షన్లు మంజూరు చేశామని కూటమి సర్కార్ చెబుతోంది.
మరో 2 లక్షల కొత్త కనెక్షన్లకు సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందించిందని కూటమి వెల్లడిస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సైతం మొదలుకానుందని సమాచారం అందుతోంది. అల్యూమినియం ట్రాన్స్ ఫార్మార్లను పెట్టాలని కొత్తగా 70 సబ్ స్టేషన్ల దిశగా అడుగులు వేస్తున్నామని కూటమి సర్కార్ వెల్లడిస్తుండటం గమనార్హం. మోదీ సర్కార్ రాబోయే రోజుల్లో ఏపీకి మరికొన్ని వరాలను ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.