
విషయం ఏంటంటే, రష్యా, అమెరికాకు ఒక భారీ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఆర్కిటిక్ ప్రాంతంలోని సహజ వనరులను అమెరికాకు కట్టబెడతామని, దానికి ప్రతిగా ఉక్రెయిన్‌ను తమకు వదిలేయమని రష్యా కోరినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే అక్కడ దొరికే ఖనిజ సంపదలో సగం వాటా అమెరికాకు ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యాపారమే ఊపిరిగా బతికే అమెరికా అధ్యక్షుడు ఈ డీల్‌కు సై అంటారా? అంటే ఎస్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
దీంతో ఉక్రెయిన్‌లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయనే చెప్పాలి. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కుర్చీకి ముప్పు వాటిల్లే రోజులు దగ్గర పడ్డాయట. ఒకవైపు యుద్ధం, మరోవైపు సొంత పార్టీలోనే వ్యతిరేకత.. వెరసి జెలెన్‌స్కీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ ఎంపీ అలెగ్జాండర్ దుబిన్స్కే సంచలన ప్రకటన చేశారు. ఎమర్జెన్సీ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, జెలెన్‌స్కీని గద్దె దించేందుకు ఇంపీచ్‌మెంట్ తీర్మానం పెడతామని బాంబు పేల్చారు.
ఇది చూస్తుంటే ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నట్టే కనిపిస్తోంది. జెలెన్‌స్కీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన్ని జైలుకు పంపుతారా? లేక దేశం వదిలి పారిపోయేలా చేస్తారా? ఏదైతేనేం, యుద్ధానికి తెరదించేందుకు తెరవెనుక పెద్ద స్కెచ్ వేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. జెలెన్‌స్కీని చాలా కాలం క్రితమే దించేస్తే చాలా మంది ప్రజల, జంతువుల ప్రాణాలు మిగిలేవి అని చెప్పుకోవచ్చు. యుద్ధం అంటూ సినిమాల్లో లాగా డైలాగ్స్ చెప్పడం వల్ల చాలా మంది బలైయ్యారు.