ఒకవైపు రష్యా యుద్ధం ఉక్రెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది. మరోవైపు మిత్రదేశాలు ముఖం చాటేస్తున్నాయి. నిన్నటిదాకా అండగా ఉన్న అమెరికా ఇప్పుడు హ్యాండ్సప్ అనేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఊహించని షాక్ తగిలింది. కష్టకాలంలో ఆదుకుంటారని భావించిన అమెరికా, ఇప్పుడు చేతులెత్తేయడంతో జెలెన్స్కీ సర్కార్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ వ్యవస్థను చక్కదిద్దడంలో అమెరికాకు చెందిన ప్రత్యేక బృందాలు సహాయం చేస్తున్నాయి. బాంబు దాడులు, క్షిపణి దాడులతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న అమెరికన్ సంస్థలను వెనక్కి రమ్మని వైట్‌హౌస్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమెరికా సంస్థలు హుటాహుటిన ఉక్రెయిన్ నుంచి తిరుగుముఖం పట్టాయి.

ఇప్పుడు ఉక్రెయిన్ చీకటిలోకి జారుకునే ప్రమాదం ముంచుకొస్తోంది. పవర్ గ్రిడ్ రిపేర్లు చేసే దిక్కులేక, విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయుధ సాయం లేదు, ఆహార సాయం లేదు, ఆర్థిక సాయం లేదు. పైగా తమ భూభాగాలను రష్యా ఆక్రమించుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తోంది. ఈ కష్టాలన్నీ ఒకెత్తయితే, ఇప్పుడు విద్యుత్ సంక్షోభం జెలెన్స్కీ మెడకు చుట్టుకోనుంది.

ప్రజాగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంది. చీకట్లో మగ్గిపోతూ, చలికి వణుకుతూ ప్రజలు తిరగబడితే జెలెన్స్కీ పరిస్థితి ఏంటి? దేశం విడిచి పారిపోవాలా? లేక ప్రజాగ్రహాన్ని చవిచూడాలా? జెలెన్స్కీ ముందు ఇప్పుడు రెండు దారులూ ప్రమాదకరంగానే ఉన్నాయి. అమెరికా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఉక్రెయిన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందా? జెలెన్స్కీ సర్కార్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా? వేచి చూడాలి.

 ఏది ఏమైనా జెలెన్స్కీ కారణంగానే చాలా ప్రశాంతంగా బతుకుతున్న ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. అతన్ని దించేసి వేరే మంచి నేతను నియమిస్తే అక్కడి ప్రజలకు చాలా ఉపశమనం కలుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. మరి చివరికి అతని తప్పులకు అతను మూల్యం చెల్లించుకుంటారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: