తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాంకు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఏదో అనుకుంటే... మరోటి జరిగింది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాంకు టీచర్‌ ఓటర్లు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాం డీలా పడిపోయారు. ఇదెక్కడి రాజకీయాలు అని కంగుతిన్నారు.


నిన్నటి కౌంటింగ్‌ సమయంలో... కోదండరాంకు ఊహించని షాక్ ఇచ్చారు టీచర్లు. ఒక ఉద్యమ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ ఐన కోదండరాం ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏమిటని ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు మేధావులు. మూడు ఉమ్మడి జిల్లాలలో 34 అసెంబ్లీ  నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒక్క ఓటు చొప్పున కూడా పడలేదని వాపోతున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాం క్యాడర్‌ , సన్నిహితులు కూడా షాక్‌ అవుతున్నారు.


తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాం మద్దతు ఇచ్చి తన స్థాయిని తాను తగ్గించుకున్నాడని విద్యావంతులు సెటైర్లు పేల్చుతున్నారు.  స్థబ్దంగా ఉన్నా పరువు నిలబడేదంటున్నారు తెలంగాణ రాష్ట్ర ఉధ్యమకారులు.  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాం  కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పరువు తీశాడంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.


ఎమ్మెల్సీ కోదండరాం ప్రచారంతో ఒరిగిందేమిటో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అర్థమైందా అంటున్నారు BRS శ్రేణులు. బండి కింద పోయే కుక్క బండిని మొత్తం తానే మోసినట్లుగా ఫీలయినట్లు.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ MLC కోదండరాం వ్యవహారం తయారైందని సెటైర్లు పేల్చుతున్నారు. కోదండరాం తెలంగాణ ఉద్యమం తానే నడిపినట్లుగా నటించాడని ఆనాడే కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తున్నారు. కోదండరాం ఏ పాటి ప్రజల నాయకుడో ఇప్పటికైనా కాంగ్రెస్ క్యాడర్ కు రేవంత్ రెడ్డికి అర్థమై ఉంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: