ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఇప్పుడు... 5 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలోనే ఎవరికి ఈ ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలని దానిపైన కూటమి ప్రభుత్వం కసరత్నం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ జనసేన సీనియర్ నాయకులు నాగబాబుకు... ఈసారి అవకాశం వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబును మండలికి పంపించాలని అనుకుంటున్నారట.


అంతేకాదు ఇందులో గెలిచిన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి కూడా ఇవ్వబోతుందట చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన ఈ ఐదు సీట్లు తెలుగుదేశం కూటమికి దక్కుతాయి. ఇందులో ఒక సీటు జనసేనకు దక్కే అవకాశాలు ఉంటాయి. మరో నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం.. సీట్ల కేటాయింపులు ఉంటాయి.


అందుకే జనసేనకు వచ్చే ఒకే ఒక్క సీటులో నాగబాబును పంపించాలని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో మాట్లాడారట. ఎమ్మెల్సీ అయిన తర్వాత వెంటనే.. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా అనుకుంటున్నారట. జనసేన పార్టీ కోసం దాదాపు పది సంవత్సరాలుగా కష్టపడుతున్నారు నాగబాబు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే.. నాగబాబు టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు.

 
కానీ నాగబాబుకు కాదని మిగతా జనసేన నేతలకు టికెట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే మిగతా వాళ్ళు కూడా సులభంగానే గెలవడం జరిగింది. పార్టీ కోసం ఇంత కష్టపడ్డ నాగబాబుకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక పదవి రాలేదు. అందుకే... గత రెండు నెలల కిందటే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నారట చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత కేబినెట్ విస్తరణలో నాగబాబు కు ఛాన్స్ వస్తుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: