ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది రోజులలో ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు లబ్ధి పొందబోతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్, అక్రమ రవాణా వినియోగం చేసినట్లు అయితే వారందరి పైన ఉక్కు పాదం మోపేలా పలు రకాల నిర్ణయాలను తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందవని వాటిని ఆపివేస్తామంటూ తెలియజేస్తున్నారు.


గంజాయి, డ్రగ్స్ వినియోగం అక్రమ రవాణా సైతం నిరోధించేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కూటమి ప్రభుత్వం తెలియజేస్తోంది.ఈ నేపథ్యంలోనే వీరి అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను రాబోయే రోజుల్లో కూడా క్యాబినెట్ సమావేశాల ముందు ఆమోదించేలా చర్చలు కూడా కొనసాగుతున్నాయట. సీఎం చంద్రబాబు ముంగిట వీటిని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పలు రకాల సన్నహాలను కూడా సిద్ధం చేస్తుందట. గత వైసిపి పాలనలో ఇవి ఎక్కువగా కనిపించాయని తెలియజేస్తుంది.


దేశంలో ఎక్కడ దొరికినా కూడా అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా పలు రకాల కథనాలు కూడా వినిపించాయి అంటూ తెలుపుతున్నారు. ముఖ్యంగా చాక్లెట్లు దుకాణాలలో కూడా ఈ గంజాయి అనేది లభిస్తోందని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని అరికడతామంటూ అందుకే ఇలా అక్రమ రవాణా పైన ఉక్కు పాదం మోపుతున్నామంటూ తెలిపారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో కొన్ని వందల ఎకరాలలో అక్రమంగా ఈ గంజాయి పంట సాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించి వాటిని ధ్వంసం చేశారట. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇందుకు సంబంధించి ప్రశ్నలు కూడా తలెత్తడంతో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మాట్లాడుతూ.. గంజాయి రవాణా పైన కూడా ఉక్కు పాదం మోపుతున్నామని అందుకోసం ప్రత్యేకంగా కొన్ని బృందాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: