
చంద్రబాబు గారు ఖచ్చితంగా మహిళగా నాకు అవకాశం ఇస్తారని వెల్లడించారు. అవీనితి చేసినా చెవిరెడ్డి చట్టప్రకారం జైలు పోతారని బాంబ్ పేల్చారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి బహిరంగంగా ఫోన్ చేశారు సుధారెడ్డి. గత ఐదేళ్ళుగా ఆడవాళ్ళను అవమానిస్తూ వైసిపి రాజకీయం చేసిందని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే నానినీ ఎదుర్కొనే దైర్యం లేక నా మీద ఆరోపణలు చేశారని మండిపడ్డారు.. చెవిరెడ్డి, చెవిరెడ్డి సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి.
వైసిపి సోషల్ మీడియాలో నా మీద పోస్టర్లు వేయించావని మండిపడ్డారు. యాబై లక్షలు లంచం తీసుకున్నానని ఆరోపణలు చేయడం కాదు.... ఆధారాలు ఉంటే బయట పెట్టూ అంటూ నిలదీశారు. ఐదేళ్ళుగా మఠం భూములను చెవిరెడ్డి దోచుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. మగవాళ్ళు మగవాళ్ళ తో పోరాటం చేయాలని...తనతో కాదన్నారు. నాని మీద రాజకీయాలు చేయలేక మహిలైన నా మీద ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో చెవిరెడ్డి ఆస్తులను తప్పుగా చూపించారని బాంబ్ పేల్చారు. రేపటి నుండి చెవిరెడ్డి అవినీతి పోరాటం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి.