- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ ) . . .
ఏపీలో ప్రతిపక్ష వైసిపి నుంచి జనసేన - తెలుగుదేశం పార్టీలోకి భారీ ఎత్తున వలసలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే కేవలం 11 సీట్ల కు మాత్రమే పరిమితం అయింది. దీంతో వైసిపి నుంచి పలువురు నేతలు మాజీ మంత్రులు .. మాజీ ఎమ్మెల్యేలు .. మాజీ ఎంపీలు ... జిల్లా పార్టీ అధ్యక్షులు చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం తమ పదవులు వదులుకొని వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సైతం ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు.
దొరబాబు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో బిజెపి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019లో వైసీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలలో జగన్ ఆయనకు సీటు ఇవ్వకుండా అప్పటివరకు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ టైంలోనే దొరబాబు పార్టీ మారతారు అని ప్రచారం జరిగిన జగన్ బుజ్జగించారు. ఇప్పుడు ఎన్నికలలో వైసీపీ ఓటమి తర్వాత దొరబాబు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండడంతో ఆ పార్టీ లో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న నిర్ణయానికి వచ్చినట్టు టాక్ ? దొరబాబు జనసేన కండువా కప్పుకు నేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజులలో పూర్తి సమాచారం బయటకు రానుంది. గోదావరి జిల్లాల్లో ఇది వైసీపీ కి పెద్ద దెబ్బే.