
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలు వడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధిస్తే .. కృష్నా - గుంటూరు గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి యూటీఎఫ్ బలపరచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు పై మాజీ మంత్రి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఇక గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం విషయానికి వస్తే కౌంటింగ్ ఏలూరు సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో కొనసాగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. 6 రౌండ్ ల లెక్కింపు పూర్తి అయ్యింది. ప్రధమ ప్రాధాన్య తా ఓటుతో గెలుపు దిశగా పేరాబత్తుల రాజశేఖర్ దూసుకు పోతున్నారు.
రాజశేఖర్ కు రౌండ్ల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి..
1 రౌండ్ లో 16520
2 రౌండ్ లో 16212
3 రౌండ్ లో 16191
4 రౌండ్ లో 15482
5 రౌండ్ లో 15632
6 రౌండ్ లో 16254
6 రౌండ్ లు పూర్తయ్యేసరికి మొత్తం 96,291 ఓట్లతో పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో ఉండగా ... 35, 614 ఓట్లతో దిడ్ల వీర రాఘవులు రెండో స్థానం లో ఉన్నారు. ఇక ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 60,677 గా ఉంది. మొత్తం 1,68,000 ఓట్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. ఇందు లో చెల్లిన ఒట్లు 1,53,182
చెల్లని ఓట్లు 14,818 కాగా .. ఇంకా లెక్కించవలసినవి దాదాపు 50,000 ఓట్లు ఉన్నాయి. ఇంకా దాదాపు 2 రౌండ్ లు మిగిలి ఉన్నాయి. ఓటింగ్ పూర్తయ్యే సరికి రాజశేఖరం మెజార్టీ 70 వేలు దాటుతుందని కూటమి వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి.