
అలాగే నాలుగు స్థానాల్లో అవకాశం కోసం చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు .. కూటమి పొత్తులో టికెట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో బాబు ఉన్నారు .. ప్రస్తుతం పదవీకాలం ముగిస్తున్న వారిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. ముఖ్యంగా యనమల రామకృష్ణుడుకి మళ్ళీ అవకాశం ఇస్తారా .. ఆయనకు రిటర్మెంట్ ఇస్తారా అనేది టిడిపిలోని హాట్ టాపిక్ గా మారింది .. ఇటీవల ఆయన తనకు అవకాశం ఇవ్వరేమోనని కొంత ఆసంతృప్తి కూడా వ్యక్తం చేశారు .. అయితే రాబోయే రోజుల్లో ఖాళీయే రాజ్యసభ సీట్లకు ఆయన పేరును పరిశీలించే ప్రతిపాదనతో అయినను పక్కనపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
మరో టిడిపి నేత పరుచూరి అశోక్ బాబుకు కూడా మరోసారి సీటు రావటం కూడా కష్టమని అంటున్నారు .. జనసేన తరఫున నాగబాబును ఎంపిక చేయడంతో మరో కాపు నేతకు అవకాశం రావటం కష్టమే .. సామాజిక సమీకరణాల ప్రకారం ఇది సాధ్యం కాకపోవచ్చు అందుకే ఈసారి రిటైర్ అయిన వారికి ఎలాంటి అవకాశం దక్కదని .. నలుగురిని కొత్త వారికే ఛాన్స్ లభిస్తుందని అంటున్నారు .. అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి ఉన్నప్పటికీ టికెట్ త్యాగం చేసిన దేవినేని ఉమా, పిఠాపురం వర్మ వంటి వారు అవకాశం కోసం గట్టిగా భారీ ఆశలు పెట్టుకున్నారు .. అలాగే వచ్చే ఐదు సంవత్సరాలలో వైసీపీకి ఒక్కటంటే ఒక ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ సీటు గాని వచ్చే ఛాన్స్ లేదు .. అన్నీ కూడా కూటమి పార్టీలకే రానున్నాయి అందుకే రాబోయే రోజుల్లో అందరికీ మంచి అవకాశాలు వస్తాయని టిడిపి హై కమాండ్ కూడా చెబుతుంది.