జాతీయ బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో చాలా రోజులగా బిజెపి జాతియ‌ అధ్యక్ష పదవి పై ఆ పార్టీ  అగ్ర నేతలు  కసరత్తులు మొదలుపెట్టారు .. అలా అనేక సమీకరణాలు పరిశీలించిన తర్వాత ఈసారి దక్షిణాదికి .. ఓ మహిళ నేతకు అవకాశం కల్పించాలని పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది .. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి, తమిళనాడు నేత వాన‌తి శ్రీనివాసన్  పేరులు పరిశీలనలోకి వచ్చినట్టుగా జాతీయ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
 

ఇక వాన‌తి శ్రీనివాసన్‌ తమిళనాడులో కీలక నేతగా ఉన్నారు .. అలాగే దూకుడుగా కూడా ఉంటారన్న పేరు ఉంది .. కోయంబత్తూర్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు .. ఈమె చాలాకాలంగా బీజేపీ లోనే ఉంటున్నారు .. అలాగే తమిళనాడు ను రెండుగా విభజించి కొంగనాడు ను ఏర్పాటు చేయాలని కూడా ఈమె బలంగా వాదిస్తూ ఉంటారు .. అయితే పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో పదేళ్లపాటు కేంద్రం మంత్రిగా పనిచేసి తర్వాత పార్టీ మారారు .. ఇక పార్టీ అధ్యక్షురాలుగా బయట నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకూడదనుకుంటే ఆమె పేరును పక్కనపెట్టె అవకాశం కూడా ఉంది .. అలాగే బిజెపి రాజకీయాలను రాజకీయాల్లాగే చేస్తుంద‌న్న సంకేతాలు కూడా పంపాలనుకుంటే పురందేశ్వరికి జాతియ‌ అధ్యక్షరాలను చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.

 

అయితే బిజెపి అధ్యక్షుడిగా ఎవరన్న పార్టీకి సంబంధించిన నిర్ణయాలను మోది , అమిత్ షా చూసుకుంటారు .. గతంలో అమిత్ షా రెండుసార్లు బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఆ పార్టీ నిబంధనలు అంగీకరించవు కాబట్టి ఆయన అధ్యక్షుడిగా తప్పుకున్నారు .. అయితే ఆ తర్వాత వచ్చిన అధ్యక్షులు ఆయన చెప్పిన విధంగానే పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు .  ఇక ఇప్పుడు కొత్తగా ఈసారి దక్షిణాది నుంచి అధ్యక్షుడిని ఎన్నిక చేసుకోవటమే వీరి రాజకీయ వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవచ్చు .. డీ లిమిటేషన్ తో పాటు ఇతర అంశాలతో దక్షిణాదిలో అసంతృప్తి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరి మోదీ, షాలు బిజెపి అధ్యక్షురాలుగా ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp