- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలు తెలుగుదేశం - జనసేన బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాక‌ల‌పాటి రఘువర్మ ఓటమి పాలయ్యారు .. అయితే గోదావరి .. కృష్ణ - గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుచుకుంది. కృష్ణ - గుంటూరు స్థానం నుంచి మాజీమంత్రి ఆలపాటి రాజా భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇక గోదావరిలో టిడిపి అభ్యర్థి పేరాబ‌త్తుల‌ రాజశేఖర్ కూడా మెజార్టీతో దూసుకుపోతున్నారు. మండలిలో తెలుగుదేశం పార్టీకి కొత్తగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ప్లస్ అవుతున్నాయి. ఇక గత ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీకి యువత .. విద్యార్థులలో ఉన్న పట్టుకు నిదర్శనం అని చెప్పాలి.


ఇక ఆలపాటి రాజా - పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు పై నుంచి దిశా నిర్దేశాలు చేసుకుంటూ వచ్చారు. జిల్లాలకు మంత్రులను ఇన్చార్జిగా నియమించడంతో పాటు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. పై నుంచి పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ స్థానికంగా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రచారం చేశారు. ఇవన్నీ కలిసి ఈ రెండు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీల తో ఘనవిజయం సాధించబోతున్నారు. గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నా పిడిఎఫ్ రెండు చోట్ల నామమాత్రపు పోటీతో సరిపెట్టుకున్న పరిస్థితి. ఏదేమైనా కూట‌మి గెలుపు జోష్ మామూలుగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: