- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

దేశవ్యాప్తంగా 2026 లో నియోజకవర్గాల పున‌ర్ విభజన జరుగుతున్న సంగతి తెలిసిందే. 2026 లో జరిగే నియోజకవర్గాల పునర్‌ విభజన నేపథ్యంలో ఆ ప్రక్రియ ఈ ఏడాది నుంచి మొదలు కానుంది. ఇక ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన పెంపుపై ప్రతిపక్ష పార్టీలు మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పెంపు ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే కుటుంబ నియంత్రణ పాటించడంతో దక్షిణాది రాష్ట్రాలలో .. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా కాస్త తక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు దక్షిణాది ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా మరో మూడు నియోజకవర్గాలు పెరగనున్నాయి. కొత్తగా మూడు లోక్సభ నియోజకవర్గాలు వస్తే ఏ ఏ ప్రాంతాలలో వస్తాయి ? అన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది.


గతంలో తెనాలి లోక్సభ నియోజకవర్గం ఉండేది. అయితే అది ఇప్పుడు ర‌ద్దు అయింది. ఇప్పుడు తెనాలి లేదా రాజ‌ధాని పేరు అమరావతి పేరుతో కొత్తగా లోక్సభ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం - తూర్పుగోదావరి జిల్లాల లో కొత్తగా ఏర్పడే నియోజకవర్గా ల‌ను కలుపుతూ తుని లేదా నర్సీపట్నం కేంద్రం గా ఒక కొత్త లోక్సభ నియోజకవర్గ ఏర్పడుతుందని అంటున్నారు. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాలను ఇప్పటికే ఉన్న ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల తోడు గా మరో కొత్త లోక్సభ నియోజక వర్గం ఏర్పడు తుందని తెలుస్తోంది. ఇలా ఏపీ కి కొత్త గా మ‌రో ముగ్గురు లోక్‌స‌భ స‌భ్యులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఎంపీ గా వెళ్లా లి అనుకునే ఆశావాహుల కు ఇది మంచి అవ‌కాశం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: