ఆంధ్రప్రదేశ్లో ఓటమి ప్రభుత్వంలో కీలక పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేనకు తొలిసారి షాక్‌ తగిలింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి .. జనసేనకు షాక్ ఇస్తూ ఫలితం వచ్చింది. పిఆర్టియు మద్దతుతో పోటీలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ని ఉపాధ్యాయులు గెలిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ టిడిపి - జనసేన కలిసి బలపరిచిన పాకలపాటి రవివర్మ ఓడిపోయారు. గాదె కు బిజెపి మద్దతు ప్రకటించడం విశేషం. ఉత్తరాంధ్ర ర్లో మొత్తం 22,000 పై చిలుకు ఉపాధ్యాయులు ఇచ్చిన ఈ ఫలితం మీద ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. రఘువర్మతో పాటు పిడిఎఫ్ అభ్యర్థిని యుటిఎఫ్ సమర్థించిన విజయ్ గౌరీకి బాగానే ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గాదెకు 7216 ఓట్లు రాగా ... రఘువర్మ కు 6851 ఓట్లు వచ్చాయి. విజయ గౌరీకి 5,8011 ఓట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు ఎవరికి రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.


అయితే ఆయనకు ఎక్కువగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పిడిఎఫ్ అభ్యర్థిని విజయ్ గౌరి నుంచి వచ్చాయి. ఆమెకు పోలైన ఓట్లలో ఎక్కువ మంది ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేసినట్టు తెలుస్తోంది. ఇది సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ‌ ఓటమికి కారణం అని తెలుస్తోంది. పిడిఎఫ్ తాను గెలవకపోయినా మంచి ఓట్లు తెచ్చుకోవడం తోపాటు గాదె శ్రీనివాసులనాయుడు గెలుపుకు పరోక్షంగా కారణమైంది. శ్రీనివాసులు నాయుడు 2007 నుంచి 13 వరకు ఆరేళ్లపాటు తొలిసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత 2013 నుంచి 2019 వరకు మరోసారి ఉత్తరాంధ్ర‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి కూడా విజయం సాధించడంతో ఆయన 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. అలాగే మూడుసార్లు గెలిచిన నాయకుడిగా ఆయన కొత్త రికార్డు క్రియేట్ చేశారు. టిడిపి - జనసేన మద్దతుతో బెరిలోకి దిగిన రఘువర్మ‌ కు షాకింగ్ ఫలితం రావడంతో టీచర్లు కూటమి ప్రభుత్వం పట్ల తమ వైఖరి ఏంటో చాటి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: