
ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఒక ఉపాధ్యాయ .. రెండు పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో విజయనగరం జిల్లా కు చెందిన గాదె శ్రీనివాసులు నాయుడు ఘనవిజయం సాధించారు. ఇక కృష్ణ - గుంటూరు జిల్లా ల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాని కి జరిగిన ఎన్నికల లో కూటమి పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఘన విజయం దిశగా దూసుకు పోతున్నారు. ఇది ఇలా ఉంటే కీలకమై న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో రెండు రోజులు గా ఉత్కంఠ భరితంగా జరుగుతోంది కూటమి.
పార్టీలో బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం దాదాపు ఖాయం అయింది. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 2.18 లక్షల ఓట్లు పోలవగా .. 8 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. ఆరో రౌండ్ వచ్చేసరికి 1.70 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తయింది. రాజశేఖర్ 60 వేల పై చిలుకు ఓట్ల ఆదిత్యం లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో నే గోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ రికార్డు విజయం సాధించబోతోంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక జరిగిన 2007 - 2013 - 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఈ మూడుసార్లు పిడిఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి రాజశేఖర్ విజయం సాధించడంతో గోదావరి గడ్డపై తెలుగుదేశం రికార్డు విజయం సాధించబోతోంది. దీంతో తెలుగు దేశం శ్రేణులు ఆనందానికి అవధులు లేవు.