ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కోస‌మంటూ గత వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ ను ప్రవేశపెట్టింది .. ఆ సమయం లో భారీ ఎత్తున మహీళ‌లతో పాటు అబ్బాయిలతో ఈ యాప్ ను డౌన్లోడ్ చేయించారని విమర్శలు కూడా వైసీపీ ప్రభుత్వం ఎదురుకుంది .. ఆదే స‌మ‌యంలో మహిళల్ని అదే స్థాయిలో వేధింపుల నుంచి కాపాడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి .. హైదరాబాద్లో జరిగిన దిశ ఘ‌ట‌న‌ తర్వాత అప్పట్లో  జగన్ తెచ్చిన ఈ యాప్ ను కూటమి ప్రభుత్వం పక్కకు తోసే ఎందుకు రెడీ అయింది . ఈ మేరకు మండలిలో హోం మంత్రి అనిత కూడా ప్రకటన చేశారు .


ఇక వైసీపీ దిశ యాప్ స్థానంలో కూటమి ప్రభుత్వం శక్తి య‌ప్ తీసుకురాబోతున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటన చేశారు .. వైసిపి తీసుకొచ్చిన దేశ య‌ప్ ఓక్క‌ మగవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగిందని .. కానీ ఇప్పుడు తాము తెచ్చే శక్తి యాప్‌ మహిళలకు ప్రయోజనం ఉంటుందని అనిత చెప్పకొచ్చారు .. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన అనగా మార్చి 8 న తాము ఈ శక్తి యాప్ ను మహిళల కోసం మొదలు పెట్టబోతున్నామని శాసనమండలలో హోం మంత్రి ప్రకటించారు .


అలాగే పని చేసే ప్రదేశాల్లో కూడా మహిళ పై లైంగిక వేధింపుల గురించి వైసిపి ఎమ్మెల్సీ మరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు .. ఇందులో ప్రదేశాల్లో మహిళ భద్రత కోసం 2013  పిఓఎస్‌హెచ్ అనే చట్టం అమలు చేస్తామన్నారు .. మహిళల రక్షణ ద్యేయంగా ప్రతి ఫిర్యాదు పై కేసు నమోదు చేసే వ్యవస్థను అమలు చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు  .. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో చట్టపరమైన పరిణామాల అవగాహన కోసం అవగాహన కల్పిస్తామని కూడా హోం మంత్రి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: