దేవదేవుడు తిరుమల తిరుపతి కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ భారీ అలర్ట్ ను జారీ చేసింది .. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చిరుతల సంచారంతో టీటీడీ అప్రమత్తంగా మారింది .. ఇక ఇప్పుడు తాజాగా నడక మార్గంలో గాలిగోపురం వద్ద తెల్లవారుజామున   చిరుత సంచారం సీసీ కెమెరాలు రికార్డు అయింది .. రాత్రి సమయంలో జూ పార్క్ మార్గంలో కూడా చిరుత సంచరించి .. ఆ తర్వాత మెట్లు మార్గంలో కూడా కనిపించడంతో తాజాగా అధికారులు వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు .. ఇక దీంతో టీటీడీ భ‌క్తులకు కీలక సూచనలు కూడా జారీ చేసింది .


తిరుమలనడ‌గ‌ మార్గంలో వచ్చే భ‌క్తులను అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచిస్తుంది .. గత సోమవారం రాత్రి తిరుపతిలోనే జూ పార్క్ మార్గంలో చిరుత వెళ్లినట్లు గుర్తించారు .. అలాగే సోమవారం అర్ధరాత్రి అలిపిరి కాలిబాట మార్గంలో గాలిగోపురం వద్ద కూడా చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాల్లో కనిపించడంతో .. వెంటనే అక్కడ ఉన్న స్థానిక దుకాణదారులు అటవీ శాఖ అధికారులు గుర్తించారు .. వెంటనే టిటిడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు .. అయితే ఈ రెండు ప్రాంతాల్లో గుర్తించిన చిరుతలు ఒకటేనా.. లేక వేరు వేరు అన్నది అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు .. అలాగే కాలినడక మార్గంలో గతంలో కూడా ఒక బాలుడు, బాలిక చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోవడం తో అప్పటి నుంచి టీటీడీ చిరుత ల సంచారంపై ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటుంది.

 

ఇక‌ ఇప్పుడు చిరుత సంచారం తో టీటీడీ భ‌క్తులను అప్రమత్తం చేసింది .. మధ్యాహ్నం రెండు గంటల వరకు 12 ఏళ్ల లోపు పిల్లలను నడక మార్గంలో అనుమ‌తించాలని నిర్ణయం తీసుకుంది .. మధ్యాహ్నం తర్వాత భక్తులు గుంపులుగా నడక మార్గంలో వెళ్లాలని కూడా స్పష్టం చేసింది .. అలాగే తిరుమల ఘాట్ రోడ్లో వన్య మృగాలు కదలిక‌లు కూడా గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు .. అలాగే ప్రత్యేకంగా వీటి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు .. అలాగే శ్రీవారి మెట్టుమార్గం, అలిపిరి కాలిబాట , ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం ప్రజెంట్ కలవరపెడుతుంది . టిటిడి మాత్రం భక్తులకు ఎలాంటి ఆందోళనవసరం లేదని .. అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారికి భరోసా ఇస్తుంది .. అలాగే టీటీడీ సూచనలు మాత్రం ,  అమలు చేయాలని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: