ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమగా  మూడు విభాగాలుగా విభజించారు.. అయితే ఆయా జిల్లాలలో పలు రకాల సర్వేలను కూడా చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కర్నూలు జిల్లా చాలా అత్యంత పేదరికాన్ని ఎదుర్కొంటున్నట్లుగా ఒక సర్వేలో తేలిందట.. అయితే ఈ సర్వేలో 42 శాతం మంది ప్రజలు పేదరికకు సైతం దిగువన జీవిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఆర్థిక సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల ఈ జిల్లా రాష్ట్రంలోనే చాలా పేదరికాన్ని ఎదుర్కొంటున్నట్లు పలు రకాల నివేదికలు తెలియజేస్తున్నాయి.


అయితే ఈ జిల్లా పేదరికానికి ప్రధాన కారణాల విషయానికి వస్తే.. అభివృద్ధి అవకాశాల లోపము, ఉపాధి అవకాశాల కొరత, వ్యవసాయానికి అవసరమైన నీరు జీవన విధానం లేకపోవడం, పరిశ్రమలు సరిగ్గా రాకపోవడం ఇలా పలు రకాల కారణాల వల్ల ఈ జిల్లా పేదరిక స్థాయిని అధికంగా ఉన్నట్లుగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ పేదరికంగా ఉన్న జిల్లా ఏమిటంటే పశ్చిమగోదావరి. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ వంటి జిల్లాలు పేదరికం చాలా తక్కువగా ఉన్న జిల్లాలుగా గుర్తింపు పొందాయట.


అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పేదరికం చాలా తక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. అలాగే వ్యాపార అవకాశాలు పరిశ్రమలు వ్యవసాయం ఎక్కువగా ఉన్న చోట కూడా పేదరికం చాలా తక్కువగా ఉన్నదట. ఇక కర్నూలు జిల్లాతో పాటుగా చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం వంటి జిల్లాలు కూడా అధిక స్థాయిలోనే పేదరికాన్ని కలిగి ఉన్నాయని వివరించారు. ఎక్కువగా గిరిజన ప్రాంతాలలోనే ఈ పేదరికం ఎక్కువగా ఉన్నదట. ప్రస్తుతం అయితే కర్నూలు జిల్లా పేదరిక సమస్య ఎక్కువగా ఉండదని ప్రభుత్వ అధికారులు కూడా అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కర్నూలు జిల్లా పేదరికంగా పేరు పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: