నిరుద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది.. అదేమిటంటే ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే పోస్టులకు సైతం ఉద్యోగాలా వయోపరిమితిని పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక ఉత్తర్వులను కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. యూనిఫామ్ సర్వీస్ రిక్రూమెంట్ కి రెండేళ్ల వయోపరిమితి అలాగే నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు సైతం 34 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు పెంచడం జరిగింది. అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 తేదీ లోపు జరిగే పరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది అంటూ వెల్లడించారు.




ఏపీ స్టేట్ సబర్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 1996 లోని రూల్స్ 12 ద్వారా ఈ వయోపరిమితిని పెంచారట. కేటగిరీలకు కూడా గరిష్ట వయోపరిమితి కంటే ఎక్కువగానే అనుమతించినట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర నియామకాల సంస్థల పైన నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. 30-9-2025 తేదీ వరకు మాత్రమే ఈ ఏజ్ పొడిగింపు ఉంటుందని తెలిపారు. అయితే రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీసులలోని రూల్స్ ప్రకారం.. శారీరక ప్రమాణాలు నిర్దేశించబడేటువంటి పోలీస్, అగ్నిమాపక, అటవీశాఖ, ఎక్స్ చేయించాక ఇలా ఇతరత్రా యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి వాటన్నిటికీ ఏదీ వర్తించదు అంటూ తెలియజేశారు.


మరి వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ చేస్తారేమో చూడాలి మరి. మొత్తానికైతే ఏపిపీఎస్సీ ద్వారా చేసేటువంటి అన్నిటికీ కూడా ఏజ్ రిలాక్షన్ ఉంటుందని తెలిపారు. మరి అంతలోపు ఏవైనా నోటిఫికేషన్లు జారీ చేస్తుందేమో ఏపీ ప్రభుత్వం చూడాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తువున్న ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెగా డీఎస్సీ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: