
కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాగబాబు
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించే అవకాశముందట. పవన్ కల్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఆయన సూచన మేరకే కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో నియమించనున్నట్లు కూటమి వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తూ.. పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు ఉండే లాంటి కార్పొరేషన్‌కు ఆయన పేరు పరిశీలించే అవకాశముందట. కొద్దిరోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు తెదేపా, ఒకటి భాజపా తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలోని నాగబాబుని సైతం ఒక కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన రెండు రోజుల క్రితమే అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సమావేశమై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరి ఏంటన్నది చూడాలి.