
అటు తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు వస్తాయని అంటున్నారు. అయితే ఇందులో బిజెపి పార్టీ జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బిజెపికి కేటాయించాలని కోరుతున్నారట. బిజెపికి సొంతంగా ఎమ్మెల్సీ దక్కించుకునే అంత బలం లేదు. కాబట్టి కూటమి ఎమ్మెల్యేలందరూ కలిసి ఓటు వేయాలి. ఈ నేపథ్యంలోనే ఒక్క సీటు బిజెపికి కేటాయించాలని అధిష్టానం అంటోందట. కేంద్రంలో కేంద్ర మంత్రి పదవులు అన్ని టిడిపికి ఇచ్చామని... ఇప్పుడు బిజెపికి ఏపీలో పదవులు ఇవ్వాలని కొంతమంది కార్యకర్తలు అలాగే నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఈ తరుణంలోనే తెరపైకి సోము వీర్రాజు పేరు వచ్చింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో... బిజెపి తరఫున సోము వీర్రాజుకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులుగా సోము వీర్రాజు పని చేశారు. అయితే ఆయనను పక్కకు జరిపి పురందరేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. అయితే ఇప్పుడు కచ్చితంగా... బిజెపికి పనిచేస్తున్న సోము వీర్రాజుకు పదవి ఇవ్వాలని అంటున్నారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు కొంతమంది బిజెపి నేతలు. దీనికి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట. అన్ని ఓకే అయితే బిజెపికి కూడా ఒక ఎమ్మెల్సీ వచ్చే ఛాన్స్ ఉంది.