
జగన్ పిటీషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని చెప్పారు. అభియోగాలు, బెదిరింపులతో జూన్ లో జగన్ నాకు లేఖ రాసారని గుర్తు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. లోక్ సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదని వెల్లడించారు. నాడు లోక్ సభలో టీడీపీ గ్రూపు నేత నాయకుడిగా మాత్రమే గుర్తించారన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదా పైన వైసీపీ అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో ఉన్నారని ఆగ్రహించారు. సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని క్లారిటీ ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఎలాంటి వారి పైన అయినా అసత్యాలు ప్రచారం చేయటం వారి ఆనవాయితీ అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. సీఎం హోదాలో నాడు జగన్ 18 సీట్లు కూడా లేకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చెప్పారని పేర్కొన్నారు.
ఇలా కోరి మతిమరుపు తెచ్చు కోవటం మాజీ సీఎంగా సరి కాదని ఫైర్ అయ్యారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంటుందన్నారు. సంధి ప్రేలాపనలు గా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నామని చురకలు అంటించారు. ఇలాగే కొనసాగితే.. భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇవాళ చేసిన కామెంట్స్ పై అందరు చర్చించుకుంటున్నారు, మరి దీనిపై వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.