
అయితే ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు విశాఖ నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్నారు . అయితే ముస్లిం మైనారిటీలకు గడిచిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఎలాంటి సీటు దక్కలేదు , అయితే వారి జనాభా విశాఖలో ఎక్కువగా ఉందని కాబట్టి మైనారిటీ కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటును భర్తీ చేయాలని ఆ వర్గం నేతలు కూడా కోరుతున్నారు .. అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపు ఇవ్వాలని కూడా వారు చెబుతున్నారు . ఇక గతంలో మూడు దశాబ్దాల క్రితం ముస్లిం మైనారిటీ వర్గం నుంచి ఎమ్మెల్యేగా టిడిపి తరఫున ఒకరు ఉండేవారు ..
అయితే ఆయన తర్వాత అవకాశం మళ్ళీ ఎవరికీ దక్కలేదని కూడా వారు అంటున్నారు .. ఇక వైశాఖలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో ముస్లిం సోదరులు కూటమి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు .. ఇప్పుడు విశాఖ నుంచి ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును అక్కడ ఉన్న వారి నుంచే భర్తీ చేస్తూ మైనారిటీ సోదరులకు ఈసారి ఆ సీటును పంచాలని వారు కోరుతున్నారు .. ఇదే క్రమంలో మత్స్యకారులు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలు కూడా కొత్త డిమాండ్ చేస్తున్నారు .. ఇక దీంతో కూటమి అధినాయకత్వం ఏమి చేస్తుందని ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది .