
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పారు కదా... అక్కడ రిగ్గింగ్ కుదరదు కాబట్టి.. టిడిపి ఓడిపోయిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి సెటైర్లు పేల్చారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను తెలియపరచడానికి కచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉండాలని... అప్పుడే ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే అక్కడ తాను మాట్లాడడానికి అసలు సమయం ఇవ్వరని... వివరించారు జగన్మోహన్ రెడ్డి.
మేము కరోనా టైంలో కూడా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చామని... కానీ చంద్రబాబు ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి చుక్కలు చూపిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈరోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగులు... వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చురకలాంటించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు అస్సలు పెరగావని బాంబు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్ర బాబు నాయుడుది అంటూ ఫైర్ అయ్యారు.
వాళ్లతో ఓట్లు వేయించుకుని ఇచ్చిన హామీలు ఇప్పుడు అస్సలు పరిష్కరించడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో చెప్పని పనులు కూడా చేసి చూపించామన్నారు. పిఆర్సి ప్రకటిస్తామన్న హామీని చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. వైసిపి నాయకులకు ఏ పథకాలు ఇవ్వకూడదా? ఇవ్వడానికి ఇది చంద్రబాబు సొమ్మ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు అవసరమా అని నిలదీశారు.