గత కొంతకాలంగా చాలామంది నేతలకు సంబంధించి రాసలీలలు ,అక్రమ సంపాదనకు సంబంధించిన ఏవో ఒక విషయం వైరల్ గా మారుతుంటాయి. మరి కొన్ని సందర్భాలలో ఏదైనా పార్టీ మీటింగులలో వారు చేసిన పనుల వల్ల ఇబ్బందులకు గురైన సందర్భాలు చాలానే చూసే ఉన్నాము.. అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకె చెందినటువంటి ఒక కౌన్సిలర్ మహిళ కార్యకర్త పైన చేతులు వేస్తూ ఉన్నట్టుగా ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా ఈ పార్టీ నేతలు హిందీ వ్యతిరేకతకు ప్రతిజ్ఞలు చేస్తున్నట్టుగా ఈ వీడియోలో చూపించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్.. ఎక్కడ ఉన్నారో అనేది మరిచిపోయి సుశీల అనే ఒక మహిళ కార్యకర్త చేతికి ఉన్న గాజుల సైతం లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ చెయ్యి ఒకసారి విడిపించుకుంది. దీంతో ఆ మహిళ చేయని మరొకసారి తడుముతూ జాకీర్ హుస్సేన్ చెయ్యి వేసినప్పటికీ.. పక్కన ఉన్న మహిళ అతని చేతిని నెట్టివేసింది అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ కావడంతో కౌన్సిలర్ చేస్తున్న ఈ చేష్టలకు తమిళనాడులోని ప్రతిపక్ష నేతలు చాలా విమర్శిస్తూ ఉన్నారు.


ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన అన్నమలై స్పందిస్తూ డీఎంకే మారువేషంలో దొంగలతో నిండి ఉంది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు నేటిజన్స్. ఇదంతా పక్కన పెడితే  తమిళం అంటే అపారమైన ప్రేమ ఉందని బిజెపి చెబుతోంది ఒకవేళ ఇదే నిజమైతే ఆ ప్రేమను చూపించాలి అంటు సీఎం స్టాలిన్ ప్రశ్నించడం జరిగింది.. అలాగే 1971 జనాభా లెక్కల ప్రకారం విభజన చేపట్టాలని కోరారు స్టాలిన్. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం అయితే తాము పార్లమెంటులో 12 సీట్లు కోల్పోయామని కేవలం 10 సీట్లు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ డిమాండ్ చేయాలంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: