ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా .. ఢిల్లీ , అమరావతి కేంద్రంగా కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయా .. కూటమి మూడు పార్టీలు రాజ్య‌స‌భ‌ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈక్వల్ షేరింగ్ తో గట్టి ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాయి ..   వైసీపీలో కీలక నేత‌గా వ్య‌వ‌హ‌రించన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు . ఇప్పుడు చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల వేళా సాయిరెడ్డి అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి .. ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహాలు సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తుంది .
 

విజయసాయి గతంలో రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత జగన్ వద్ద ఎంతో కీలకంగా ఉన్నారు .  వైసిపి తొలి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు .. అలాగే 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత చోటుచేసుకున్న వరుస పరిణామాలతో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి ఊహించిన నిర్ణయం తీసుకున్నారు .. ఇక వైసిపి రాజ్యసభ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా కూడా చేశారు . ఆ తర్వాత జగన్ విజయసాయిరెడ్డి రాజీనామా పైన కూడా సంచలనం వ్యాఖ్యలు చేశారు .. రాజకీయాల్లో ఉన్నవారికి విలువలు ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు .. ఈ కామెంట్ లో పైన కూడా సాయి రెడ్డి స్పందించారు .. ప్రస్తుతం తాను వ్యవసాయం చేసుకుంటున్నాని ఏ పార్టీలో చేరే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పారు .. ఇక దీంతో విజయసాయిరెడ్డి కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలని క్లారిటీకి వ‌చ్చేశారు .

 

అలా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ అయ్యారు .. అయితే ఆ సమావేశంలో ఆమెపై చేసిన వ్యాఖ్యలు వెనుక కారణాలను కూడా ఆమెకు వివరించినట్లు షర్మిల చెప్పుకోచ్చ‌రు .. ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి తాజాగా రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి థ‌న్‌కర్ హైదరాబాద్కు వచ్చిన సమయంలో ఊహించిన విధంగా ప్రత్యక్షమయ్యారు .. సాయి రెడ్డికి ఆయన సైతం మంచి ప్రాధాన్యత ఇచ్చారు .. విజయ సాయి రెడ్డి ఆకస్మిక పర్యటన కారణంగా కొత్త చర్చక తెర మీద‌కు వచ్చింది .. విజయసాయిరెడ్డి ఇప్పుడు బిజెపిలో ముఖ్య నేతలతో ఉన్న సంబంధాలు చర్చకి వస్తున్నాయి .

 

అలాగే ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చ జరుగుతుంది .. విజయ సాయి రెడ్డి తిరిగి రాజకీయంగా జూన్ నెల నుంచి యాక్టివ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అయితే అది వైసిపి నుంచి కాకుండా బీజేపీలోకి విజయసాయిరెడ్డి వేళ బోతున్నారని ప్రచారం .. 2019 ఎన్నికల ముందు ఆ తర్వాత బిజెపి , వైసిపి మధ్య గట్టి వారధిగా విజయసాయిరెడ్డి ఉన్నారు .. ఇక ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా విజయసాయిరెడ్డి బిజెపిలోకి వెళితే వైసిపితో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారని చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది .. ఇక వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయ్ సాయి రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా కీలకము కావడం ఖాయమని .. అయితే ఏ పార్టీలో ఉంటారు ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉందని చర్చ రాజకీయ వర్గాలు నడుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: