ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. ఆమెను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ.. కూటమి వేసే స్కెచ్ ఫలిస్తే మాజీ మంత్రి రోజా కూడా చిప్పకూడు తినాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ మంత్రి రోజాకు... తాజాగా షాక్ ఇస్తూ కూటమి ప్రభుత్వం....ఆడుదాం ఆంధ్ర పై విచారణకు రంగం సిద్ధం చేసింది.

 గత వైసిపి ప్రభుత్వం లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తం గా ఈ ప్రోగ్రాం ను హల్చల్ చేసింది వైసిపి సర్కార్. అప్పుడు ఈ బాధ్యతలు మొత్తం మాజీ మంత్రి రోజా నిర్వర్తించారు. అయితే ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో... చాలా అవకతవకలు జరిగాయి అన్నది టిడిపి కూటమివాదన.

 అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా మండలిలో ఆడుదాం ఆంధ్ర  కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని బాంబు పేల్చారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే దీనిపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటన చేయడం.. జరిగింది. ఈ కమిటీ కేవలం 45 రోజుల్లో సభకు నివేదిక అందిస్తుందని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

 ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసిపి ప్రభుత్వం దాదాపు 120 కోట్లు ఖర్చు.... చేయడం జరిగిందన్నారు. అందులో స్కాం జరిగిందని టిడిపి వాదన. ఈ డబ్బులు రోజా... తినేసిందని టిడిపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు పై విచారణ జరుపుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం... ఇప్పుడు రోజాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ కేసును రోజా ఎలా డీల్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: