
ఇక గతంలో నాగబాబు కు రాజ్యసభ సీటు కేటాయించక పోవడం వల్ల ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రి గా చేయాలని నిర్ణయించారు .. ఇక మార్చిలో ఎమ్మెల్సీ గా ప్రమాణం చేసిన తర్వాత మంత్రి గా బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ విషయం లో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ మంత్రి గా ప్రమాణం చేయించే క్రమం లో మాత్రం జనసేన పార్టీ మరో ఆలోచన చేస్తున్నట్టు గా తెలుస్తుంది .. క్యాబినెట్ హోదా ఉండేలా కీలక కార్పొరేషన్ కు చైర్మన్గా నియమించి .. ఆ స్థానం లో మరొకరికి మంత్రి గా అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు గా తెలుస్తుంది . అలాగే పలు సామాజిక సమీకరణాలు కలవకపోవడం తో ఇతర కారణాల వల్ల ఈ ఆలోచన చేస్తున్నట్టు గా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి .
ఇప్పటికే నామినేషన్ల స్పీకరణ మొదలైంది .. వైసిపికి ఎమ్మెల్సీగా పోటీ చేసే బలం లేదు .. ఈ కారణం గా పోటీ చేసే అవకాశం కూడా లేదు .. అలాగే చంద్రబాబు ఎంపిక చేసిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు . ఇక ఇందులో ఒక సీటు జనసేనకు కేటాయిస్తున్నందున మిగిలిన నాలుగు సీట్లు చంద్రబాబు భర్తీ చేయనున్నారు .. వాటిలో వంగవీటి రాధా , పిఠాపురం వర్మ , దేవినేని ఉమా వంటి వారు ఈ ఎమ్మెల్సీ పదవుల కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు .