ఈ మధ్యకాలంలో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉండడంతో ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అయితే మరి కొంతమంది ఈ డబ్బులు కట్టలేక అప్పులు చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. చివరికి అప్పులు ఎక్కువై కొంతమంది ఆత్మహత్య పాల్పడుతున్నప్పటికీ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని సచివాలయ ఉద్యోగి వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి ఈ ఆన్లైన్ బెట్టింగులు ఆడి మోసపోయానని తన భార్య పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటానంటూ ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు రాష్ట్రమంతట వైరల్ గా మారుతున్నది.




అయితే ఈ వీడియో మంత్రి నారా లోకేష్ వరకు వెళ్లగా వాళ్ళని ఇంటికి తిరిగి రావాలని కోరుతూ.. ఆ సచివాలయం ఉద్యోగికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని లోకేష్ ఇలా స్పందించారట.."మనుషులుగా మనం తప్పులు చేస్తూ ఉంటాము అయినా వాటి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం ముందు మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి.. జీవితాలను సైతం నాశనం చేసే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి మీ కుటుంబానికి తాము భద్రతగా ఉంటాము బాధ్యతలు తీసుకుంటామంటూ నారాలోకేష్ రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా లోకేష్ స్పందించడం జరిగింది. ఈ విషయంపై ఇలా స్పందించడంతో అందరూ కూడా ప్రశంసిస్తున్నారు లోకేష్ ను.


ఇక సచివాలయ ఉద్యోగి పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారట లక్ష్మీ ప్రసాద్.. ఇటీవలే తను ఆన్లైన్ బెట్టింగులు ఆడి డబ్బులు పోగొట్టుకొని చివరికి పెన్షన్ డబ్బులతో పరారయ్యారు అనే విషయం వైరల్ గా మారింది.. ఆ వెంటనే కొన్ని గంటలకు ఒక సెల్ఫీ వీడియోతో మాట్లాడుతూ తాను ఆన్లైన్ బెట్టింగుల ద్వారా మోసపోయానని తన కుటుంబం పిల్లలు రెండు రోజులుగా అసలు ఏమీ తినలేదని తెలియజేశారు నెలరోజుల లోపు పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లిస్తానని జిల్లా కలెక్టర్ తమను క్షమించాలంటూ ఒక వీడియోని విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: