కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టును రెండు మూడు సంవత్సరాలలోనే పూర్తి చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కింది. ఈ దెబ్బకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి మూడు పంటలు పండేలా.. పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మేడిగడ్డ ఇష్యూ తప్ప... కాలేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవాంతరాలు జరగలేదని ఇప్పటికే నివేదికలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కెసిఆర్ కట్టాడన్న... ఒక్క విషయంతో... ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రజలే ఫైర్ అవుతున్నారు.

 అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాలేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా నిర్మించిందని కేసీఆర్ ను పరోక్షంగా మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు. అనవసరంగా తెలంగాణ గుండా వెళ్లే నీళ్లన్నీ సముద్రంలో కలుస్తున్నాయి.. అనవసరంగా అందులో కలిస్తే ఏమీ రాదు. అలాంటి నేపథ్యంలో తెలంగాణ కోసం కాలేశ్వరం ప్రాజెక్టు కట్టడం అద్భుతమైన ఆలోచన అని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.

 ఒక కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకురావడం... మంచిపని అని ప్రశంసించారు. ఏ ప్రభుత్వం చేసిన ఇలాంటి పనిని మెచ్చుకోవాలన్నారు. పై భాగం నుంచి తెలంగాణ గుండా వచ్చే నీళ్లను తెలంగాణ ప్రజలు ఎంత వాడుకున్నా తమకు ఇబ్బంది లేదన్నారు. వాళ్లు వాడుకోకపోతే అనవసరంగా సముద్రంలో కలుస్తాయన్నారు. అయితే చంద్రబాబు చేసిన కామెంట్స్ తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారిగా కంగుతుంది.

 తాము కాలేశ్వరం ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు మాత్రం మెచ్చుకోవడం ఏంటని? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై హరీష్ రావు భిన్నంగా స్పందించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రారంభించినట్లు తెలిపారు. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా కోర్టు లో కేసులు వేసింది చంద్రబాబు నాయుడు అని ఫైరయ్యారు. తన దగ్గర సాక్షాలు కూడా ఉన్నాయని తీసి చూపించారు. కానీ ఈ చంద్రబాబు ఒక్కటి నిజం చెప్పాడని.. కాలేశ్వరం ప్రాజెక్టు మంచిదన్నాడని.. హరీష్ రావు.. తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: