తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... నిన్నటి వరకు పట్టభద్రులు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు  కొనసాగిన సంగతి తెలిసిందే.  దాదాపుగా అన్ని ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఏపీలో కూటమి దుమ్ము లేపితే తెలంగాణలో మాత్రం బిజెపి రఫ్ ఆడించింది. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 10వ తేదీ లోపు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది.

 ఈనెల 20వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నారు. తాజా లెక్కల ప్రకారం ఏపీలో 5 ఎమ్మెల్సీ  సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఐదుకు ఐదు సీట్లు కూడా కూటమి... దక్కించుకోబోతుంది. 160 కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్న టిడిపి కూటమికి... అన్ని సీట్లు గెలుచుకునేందుకు అర్హత.. ఉంది. అయితే కూటమిలో మూడు పార్టీలు ఉన్న నేపథ్యంలో... బిజెపికి ఒకటి... జనసేనకు మరోటి ఇవ్వబోతున్నారట.

 ఇప్పటికే నాగబాబుకు టికెట్ ఇచ్చినట్లు ప్రకటించేశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారని టాక్.   భారతీయ జనతా పార్టీలో సోము వీర్రాజుకు చాన్స్ వస్తుందని చెబుతున్నారు. ఇక మూడు సీట్లల్లో టిడిపికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో... పిఠాపురం వర్మ కు ఎమ్మెల్సీ టికెట్ ఈసారి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు వేసే ఓటు కాబట్టి కచ్చితంగా సీటు గెలవచ్చు.

 టికెట్ ఇచ్చారంటే ఎమ్మెల్సీ అయిపోయినట్టే. అయితే పిఠాపురం వర్మకు టికెట్ ఇవ్వకుండా జనసేన నాయకులు కుట్రలు చేస్తున్నారట. పదవి లేకుండానే పిఠాపురంలో వర్మ రచ్చ చేస్తున్నాడని... ఒకవేళ పదవి వస్తే వర్మ ఆగడాలకు హద్దు ఉండదని జనసేన నేతలు అనుకుంటున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా చక్రం తిప్పి పిఠాపురం వర్మకు టికెట్ రాకుండా చేయాలని డిసైడ్ అయ్యారట. మరి దీనిపై చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: