ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదన పై వైసిపి విమర్శలు ఎక్కు పెట్టింది .. ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేరేలా కనిపించడం లేదని పేర్కొంది . అలాగే ఈ బడ్జెట్ పై తాజాగా వైసీపీ శాసనమండలి సభ్యురాలు వ‌రుదు కళ్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు సంధించారు .. మధ్యాహ్నం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె బడ్జెట్ కేటాయింపుల పై మాట్లాడారు . ఈ సంవత్సరం బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా నిరాశపరిచిందని పేర్కొన్నారు .
 

తల్లికి వందనం , అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయింపుల్లో భారీగా కోత విధించారని కూడా కళ్యాణి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు .. జగన్ ముఖ్యమంత్రి గా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి , రైతు భరోసా ప్రజలకు ఇచ్చే వారిని ఆమె పేర్కొన్నారు .. ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కేవలం కంటి తుడుపు చ‌ర్య‌గా నిధులు కేటాయించారని ఆమె విమర్శించారు . అలాగే కూటమి అమలు చేసిన దీపం పథకాన్ని కేవలం 90 లక్షల మందికి కుదించారని ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు .. అలాగే సున్నా వడ్డీ కి నిధులు లేవని , ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్ల రూపాయల మాత్రమే ఇచ్చారని ఇవి ఏమాత్రం సరిపోవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు .

 

అలాగే ఈ బడ్జెట్ అంకెల గరిడీ గానే కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ  కళ్యాణి అభిప్రాయపడ్డారు . అలాగే కుట‌మి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే వరకు తాము పోరాడుతామని వైసిపి ఎమ్మెల్సీ కళ్యాణి హెచ్చరించారు .. అలాగే ఈ పథకం పై శాసనమండలిలో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ మంగమ్మ తో పాటు కలిసి వాయిదా తీర్మానం ఇచ్చారు .. మండలి చైర్మన్ ఈ తీర్మానాని తిరస్కరించడం తో మీడియా పాయింట్ వద్ద ఆమె కూటమీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

ap