తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న పెద్ద విలన్ గా మారిపోయారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. చాలావరకు హామీలను కూడా.. అమలు చేయడంలో విఫలమైందని కూడా చెబుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో జనాలు బండ బూతులు తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని..! అయితే.. ఇలాంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి... రేవంత్ రెడ్డి వర్గాన్ని తిట్టడం మొదలుపెట్టారు

 కాంగ్రెస్ పార్టీలో రెడ్డి రాజ్యాంగం ఉందని.. తమకు బీసీ రాజ్యం కావాలంటూ తీన్మార్ మల్లన్న కొత్త ప్రోగ్రాం పెట్టాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న ఇటీవల సస్పెండ్ చేశారు.  ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన తీన్మార్ మల్లన్న... మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి... ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డికి సీఎం కూర్చి పునాది వేసింది తానేనంటూ... సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న.

 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడింది... తాను అంటూ రెచ్చిపోయారు. రెడ్డి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి సొంత నాయకులపై విరుచుకు పడితే... ఎలాంటి తప్పులు ఉండవు...? బీసీ బిడ్డ అయిన నేను ప్రశ్నిస్తే... నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అంటూ నోటికి వచ్చిన బూతులతో రెచ్చిపోయారు తీన్మార్ మల్లన్న.

 అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సవాల్ విసిరారు తీన్మార్ మల్లన్న. నువ్వు చేసిన కుల గణనా సర్వే తప్పు అని నిరూపిస్తే నేను చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.  అయితే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పొద్దున నుంచి కాంగ్రెస్ మంత్రులు అలాగే నేతలు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: