
తాజాగా వైయస్ వివేకానంద రెడ్డి కేసులో కీలకమైన వ్యక్తి వాచ్మెన్ రంగన్న అనారోగ్యంతో మృతి చెందారట. గడిచిన కొన్ని గంటల క్రితం ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కి తరలించారు.. అయితే చికిత్స పొందుతూ మరణించారు.. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న రంగన్న.. వివేకాను హత్య చేసిన నలుగురిని గుర్తించి సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు తాజాగా తన భర్త రంగన్న మరణించడంతో సుశీలమ్మ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. తన భర్త రంగన్న అనారోగ్యతో గత కొన్ని నెలలుగా బాధపడుతున్నారని గత ప్రభుత్వంలో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారని.. 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేవారు. గత మూడు నెలల నుంచి తన భర్త చాలా మానసికంగా ఇబ్బందులు పడ్డారని.. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తాను వచ్చేలోపు తాను బ్రతుకుతానో లేదో అని సుశీలతో రంగన్న చెప్పాడని తెలిపింది సుశీలమ్మ.
తన భర్త బాగాలేదని తమ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న కొంతమంది పోలీసులు తనకు ఫోన్ చేసి చెప్పారని.. ఆసుపత్రికి తరలించామని చెప్పి చివరికి ఊపిరితిత్తుల వ్యాధితో మృతి చెందాలని తెలిపారని సుశీలమ్మ వెల్లడించింది.