
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో నేతల మధ్య విబేధాలు ఉండకూడదని అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ డివిజన్ లో బద్ధ శత్రువులు ఒకే గూటికి చేరారని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా వ్యవహరించిన నేతలు ఇప్పుడు మాత్రం కలిసిపోవడం, కలిసి పని చేయడం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతోందని చెప్పవచ్చు.
ఇద్దరు నేతల మధ్య దాదాపుగా 20 సంవత్సరాల నుంచి విబేధాలు ఉండగా ఆ విబేధాలను మరిచిపోయి వాళ్లు ముందడుగులు వేస్తున్నారు. పెండెం దొరబాబు జనసేనలో చేరడం పక్కా అని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలుస్తోంది. వర్మ, దొరబాబు మధ్య సఖ్యత లేని నేపథ్యంలో ఏం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
అయితే పిఠాపురంలో బద్ధ శత్రువులను ఒకటి చేయడం ద్వారా భవిష్యత్తులో పవన్ కు ఇబ్బందులు లేకుండా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఒకే ఒరలో రెండు కత్తులు చేరితే మాత్రం ఆధిపత్య పోరు వల్ల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వర్మ, దొరబాబు ఒకే పార్టీలో చేరినా కలిసి పని చేసే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఎన్నికలు జరిగి దాదాపుగా 9 నెలలు అవుతున్నా పిఠాపురం నియోజకవర్గం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుండటం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా తరచూ చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాల్స్ ఉంది.