
ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా, అలాగే బుద్ధా వెంకన్న ఇద్దరు కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం అధిష్టానం ముందు మొరపెట్టుకున్నారట. ఈసారి ఎలాగైనా తమకు పదవి.. ఇద్దరు నాయకులు అనుకుంటున్నారట. బీసీ నాయకుడైన బుద్ధ వెంకన్న.... చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. కాబట్టి తనకు పదవి... ఇస్తాడని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు కూడా.. అప్పటి వైసిపి నేతలపై విరుచుకుపడ్డారు.
సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకు బాడీగార్డ్ లాగా పని చేశాడు బుద్ధ వెంకన్న. ఇక వంగవీటి రాధా విషయానికి వస్తే... టిడిపి పార్టీలోనే ఉంటూ చాలాసార్లు... టికెట్ త్యాగం చేశారు. కానీ టిడిపి విజయానికి ఎన్నోసార్లు కృషి చేశారు వంగవీటి రాధా. గతంలో టికెట్ ఇవ్వకపోయినా కూడా పని చేశారు. అయితే ఈసారి ఎమ్మెల్సీ పదవి ఇస్తేనే.. తనకు న్యాయం జరుగుతుందని... చంద్రబాబుతో చర్చించారట వంగవీటి రాధా.
అయితే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ నినాదం కాబట్టి... బీసీ నాయకుడైన బుద్ధ వెంకన్నకు ఇస్తారని అంటున్నారు. అటు నాగబాబుకి ఇప్పటికే ఎమ్మెల్సీ టికెట్ ఫైనల్ అయింది. కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధకు మరోసారి టికెట్ వచ్చే ఛాన్స్ లేదని కొంతమంది అంటున్నారు. బీసీ నినాదం తెరపైకి వస్తున్న నేపథ్యంలో బుద్ధా వెంకన్నకు పక్క వస్తుందని... చెబుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.