కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం జరిగింది.  రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి(బీజేపీ) విజయం సాధించారు. ఈ దెబ్బకు కౌంటింగ్ హాల్ నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయగా ఒడిపోయింది కాంగ్రెస్ పార్టీ.  మూడు జిల్లాలు తిరిగి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైంది.




అయితే కరీంనగర్ - మెదక్- నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి.. కారణం సొంత పార్టీ నేతలే అని తెలుస్తోంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ప్రకటించిన తర్వాత... ప్రచారానికి తెలంగాణ మంత్రులు ఎవరు పోలేదట. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన దుద్దిల్ల శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా... తమకు పట్టనట్టే ఉన్నారట.


దీంతో ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక చేసేదేమీ లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉన్నఫలంగా ఎస్ఎల్బీసీ సంఘటన ఉన్నప్పటికీ కరీంనగర్ వెళ్లి ప్రచారం చేశారు. అయినా కూడా లోకల్ లీడర్లు నరేందర్ రెడ్డి కి సరిగా సపోర్ట్ చేయకపోవడంతో... కాంగ్రెస్ పార్టీ ఓడింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం.. కాస్త ఆలస్యమైంది.


అందులోనూ మళ్లీ నరేందర్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన.. నాయకుడు కావడం గమనార్హం. కాంగ్రెస్ అంటేనే రెడ్డి రాజ్యం అయిపోయిందని గత కొన్ని రోజులుగా జనాలు కూడా చర్చించుకుంటున్నారు.  ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 61 వేలకు పైగా ఓట్లు సాధించాడు. అతనికి టికెట్ ఇస్తానని ఆశ చూపి చివరికి నరేందర్ రెడ్డి కి ఇచ్చారు. దీంతో బీసీ నాయకుడు కాబట్టి ప్రసన్న హరికృష్ణకు చాలామంది ఓట్లు వేశారు. అప్పుడే ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ సులభంగా గెలిచేది. ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసుకున్న తప్పిదాల కారణంగానే కరీంనగర్లో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: