
అవినీతిపరమైన కుటుంబ రాజకీయాలకు సైతం మార్గం చూపుతున్నారంటూ పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అయ్యారు కేఏ పాల్.. 21 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే సీటు వస్తే లక్ష మంది పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వారికి కూడా ఇవ్వకుండా కుటుంబ పార్టీకి ఇస్తున్నారు.. అందుకే జనసేన కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరండి అంటూ కేఏ పాల్ విమర్శించడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ కుటుంబాలకు మాత్రమే రాజకీయ ప్రోత్సాహం ఉంటుంది అంటూ హెచ్చరించడం జరిగింది.
హైదరాబాదులో ఉంటున్న నటుడిని తీసుకురావడం వల్ల పార్టీ కార్యకర్తల శ్రమను తాకట్టు పెట్టినట్లుగా మారిపోయింది అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు.. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేలుకోండి ప్రజాశాంతి పార్టీలో చేరండి అంటూ కేఏపాల్ తెలియజేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అటు సీఎం చంద్రబాబుని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వారు చెప్పిన హామీలను అమలు చేయకుండా ఉండడంతో ప్రశ్నించడమే కాకుండా.. గతంలో తప్పిపోయిన అమ్మాయిల గురించి మాట్లాడిన వ్యాఖ్యలపైన ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది కేఏపాల్.. అయితే కేఏ పాల్ ఇలా ప్రశ్నించడంతో చాలామంది జనసేన కార్యకర్తలు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు.