
తీన్మార్ మల్లన్న వెనుక ఎవరు ఉన్నారు అని…? అన్ని పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఇంత ధైర్యంగా రెచ్చిపోతున్నాడంటే.. ఎవరో ఒకరు ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. అయితే కొంతమంది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెనక నుండి కథ నడిపిస్తున్నారని తెగ చర్చ చేస్తున్నారు. దానికి కారణం తీన్మార్ మల్లన్న పక్కన ప్రెస్ మీట్ లో పక్కన కూర్చున్న విజయ్ అనే పీఆర్‌ఓ అని సమాచారం. ఒకప్పుడు కేసీఆర్ వద్ద పిఏ గా పనిచేసిన విజయ్.. ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో తిరుగుతున్నాడు.
విజయ్ పద్దతి బాగోక పోవడంతో, పలు అక్రమ ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. అయితే.. ఇన్నాళ్లకి మళ్లీ తెర మీదకు రావడంతో విజయ్ - కేసీఆర్ - మల్లన్న అంటూ తెగ లెక్కలు వేస్తున్నారు కొంత మంది మేధావులు. అయితే మల్లన్న పేరు కూడా వినడానికి సుముఖంగా లేని బీఆర్ ఎస్ పార్టీ... అతనితో ఎందుకు ఇలాంటి పనులు చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.
కేసీఆర్ సంగతి పక్కకి పెడితే మొత్తం పార్టీలో మల్లన్న మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని అంటున్నారు. కొందరు కావాలనే... తిక్క తిక్క వాదనలు చేస్తున్నారని అంటున్నారు. విజయ్ - కేసీఆర్ - మల్లన్న ముగ్గురు ఒకటేనని..కొత్త చర్చకు దారి తీస్తున్నారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.