
ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలోను కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనవిజయం సాధించారు. ఉమ్మడి కృష్ణ - గుంటూరు జిల్లాల నియోజకవర్గం నుంచి . . ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం సాధించారు. గుంటూరు నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా గెలిస్తే .. గోదావరి నియోజక వర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖరం గెలిచారు. అది కూడా ఇద్దరు కాస్త అటు ఇటుగా 90 వేల ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. ఇదేమి చిన్న విషయం కాదు వైసిపి చెబుతున్నట్టు ప్రజల్లో వ్యతిరేకత ఉండి ఉంటే ఇది సాధ్యమవుతుందా ? అనేది ప్రశ్న. ఎంత పోల్ మేనేజ్మెంట్ చేస్తున్న చదువుకున్న విద్యావంతులలో ఇంకా కూటమి ప్రభుత్వంపై అనుకూల స్పష్టంగా ఉంది.
ఈ విజయం సహజంగానే కూటమి పార్టీలలో జోష్ నింపింది. ఇదే సమయంలో వైసీపీ ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు కూడా కాకుండానే ఏదో జరిగిపోయిందని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యవహారం తేలిపోయింది. ప్రజల్లో వైసిపి అనుకున్నట్లుగా అంత వ్యతిరేకత లేదని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. కూటమి వెంటే తాము ఉన్నామన్న సంకేతాలు కూడా ఇచ్చినట్లయితే వైసీపీ నేతలు నింగిలో మబ్బులు చూసి .. నీళ్లు వడ పోసుకున్న చందంగా రాజకీయాలు చేస్తే మన ముందు వారికే ప్రమాదం ఎప్పటికైనా వారు ప్రజల నాడి పట్టుకుని ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుపుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వైసీపీ అంటే ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా పార్టీని కేవలం తాడేపల్లి హౌస్ కు పరిమితం చేస్తే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవు.