
ఇలాంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని కృష్ణమురళి. ఈ తరుణంలోనే... ఇవాళ పోసాని కృష్ణమురళి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిపింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హై కోర్టు. దీంతో పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది.
ఇక ఇటు రామ్ గోపాల్ వర్మ కేసులో కూడా ఇవాళ ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ ఇస్తూ... ప్రకటన చేసింది. రామ్ గోపాల్ వర్మ కేసులో స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసిన కోర్టు.... రామ్ గోపాల్ వర్మ కేసులో స్టే ఇవ్వడం జరిగింది. 2019లో విడుదలైన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై 2024లో కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు న్యాయమూర్తి.
రాజకీయ దురుద్దేశంతో తనపై నమోదైన పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మ.. కౌంటర్ పిటీషన్ వేశారు. అయితే.. ఈ పిటీషన్ పై విచారణ చేసిన కోర్టు.... స్టే ఇవ్వడం జరిగింది. దీంతో.... రామ్ గోపాల్ వర్మ కు బిగ్ రిలీఫ్ దక్కింది.