- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి విరమించుకుని పొలం పనులు చేసుకుంటానని చెప్పారు. కానీ అదంతా అబద్ధమే అని ఢిల్లీ రాజకీయ వర్గాల స్పష్టంగా చెబుతున్నాయి. ఆయన బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. ఆ తర్వాతే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు .. వెంటనే చేరితే మరో రకమైన ప్రచారం జరుగుతుందని తన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఆయన బిజెపిలో చేరుతున్నట్టు సమాచారం జూన్ లేదా జూలై నెలలో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని చెప్తున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ధ‌న్ బ‌డ్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ విజయసాయిరెడ్డి ప్రత్యక్షం అయ్యారు .. వంగి వంగి దండాలు పెడుతూ ఫోటోలు దిగారు.


విజ‌య సాయి రాజకీయాల నుంచి విరమించుకుంటే బిజెపికి చెందిన ముఖ్య నేతలు ఇప్పుడు ఎవరు వచ్చినా హాజరు వేయించుకుని ఎందుకు ? దండాలు పెడుతున్నారో అన్నది అర్థం కాలేదు. కానీ విజయ్ సాయి రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటో తర్వాత తెలియడం తో అందరూ షాక్ అవుతున్నారు. విజయ సాయి రెడ్డి పై ఎప్పటికే లెక్కలేని కేసులు ఉన్నాయి. అక్రమాస్తుల కేసులు ఆయన నెంబర్ 2 గా ఉన్నారు. ఆ కేసులు ఇంకా ట్రయిల్కే రావటం లేదు .. ఇప్పుడు అవి విచారణకు వస్తే ఆయనతో పాటు జగన్ కూడా జైలుకు వెళ్లాలి . . అందుకే విజయసాయిరెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది. విజయ సాయిరెడ్డి బిజెపిలో చేరేందుకు కూటమి పార్టీలు అంగీకరిస్తాయా ? లేదా అన్నది సస్పెన్స్. రాజీనామా చేసినప్పుడు చంద్రబాబుతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి .. పవన్ మిత్రుడు అంటూ ఆయన చెప్పిన మాటలు కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: