
పూలు జల్లి నివాళులు అర్పించారు మంత్రి కొండా సురేఖ. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.... కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖపై ప్రతి పక్ష బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం విమర్శలు చేస్తోంది. మనుషులు చనిపోతే స్పందించలేదు కానీ... కుక్కలు చనిపోతే ఓడుస్తున్నావా అంటూ పోస్టులు పెడుతున్నారు.
రేవంత్ ప్రభుత్వంలో కుక్కకు ఉన్న విలువ కూడా విద్యార్థులకు లేదా..? అంటూ బీఆర్‌ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మీ హయాంలో విషపు భోజనం తిని చనిపోయిన విద్యార్థుల సంగతేంటి సురేఖ గారూ? అంటూ నిలదీస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం సంతాపమైనా ప్రకటించారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కుక్కకి ఇచ్చిన విలువ.. మనిషి ప్రాణాలకు ఇవ్వలేరా? మీలో మానవత్వం పూర్తిగా చనిపోయిందా? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ.
ఇది ఇలా ఉండగా.... మంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వివాదాల్లో తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ ఇరుకున్నారు. సమంత క్యారెక్టర్ పై కామెంట్స్ చేయడం... వేముల రాజన్న దేవాలయంలో కోడెల స్కాం, బర్త్ డేకు బీర్లు అప్పట్లో రచ్చ చేశారు. ఇక ఇప్పుడు కుక్క చనిపోతే.. కన్నీళ్లు పెట్టుకున్న కొండా సురేఖ పై ట్రోలింగ్ కూడా జరుగుతోంది.