
ఇక ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్త కర వ్యాక్యలు చేశారు. నాకు చంద్రబాబుకు వైరం ఉంది అని అంటారు ......అది నిజమే ....కానీ ఇప్పుడు కాదని క్లారిటీ ఇచ్చారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని...వాటిని మరిచిపోవాలని వెల్లడించారు. ఎల్లకాలం పరుషంగా ఉండాలిస్సిన అవసరం లేదని వివాదంపై క్లారిటీ ఇచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు.
1978లో వెంకయ్య నాయుడు, నేను తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టామని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచ్ లు తగ్గలేదు సరికదా ఇప్పుడు పెరిగాయని తెలిపారు. దగ్గుబాటి మా కుటుంబంలో విశిస్టమైన వ్యక్తి అన్నారు. ప్రతీ అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తారని వెల్లడించారు. 40 ఏళ్లు కలిసి వున్నామని... కానీ ఆయన పుస్తకం రాయడం ఏంటని నాకు డౌట్ వచ్చిందని పేర్కొన్నారు.
వేంకటేశ్వర రావు రైటర్ కాని రైటర్ అన్నారు. పురంధేశ్వరి ఎన్నికలను నడిపించిన తీరు అభినందనీయం అని కొనియాడారు. డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయలేదు...మంత్రిగా ఉండి ప్రాక్టీస్ చేశారు....సినిమాలు తీశారన్నారు. మా ఫ్యామిలీలో రిలాక్స్ & జోవియల్ గా వుండే వ్యక్తి అన్నారు. యాక్తివ్ లైఫ్ నుంచి రిటైర్డ్ లై ఫ్ కు వచ్చారు ఎలా కాలక్షేపం అని అడిగాను.....నాకూ అటువంటి రావచ్చు అందుకే అడిగానని పేర్కొన్నారు. వేంకటేశ్వర రావు రోజు వారీ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ పేకాట ప్రస్తావన తెచ్చారు చంద్రబాబు.