
దీంతో నగరంలో రైల్వే స్టేషన్స్, బస్టాండ్ల వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ .. ఛలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారట. అయితే ఇటీ వలె ప్రభుత్వం ఆశా వర్కర్ల వయోపరిమితి రెండేళ్లు పెంపు, మెటర్నటి సెలవులను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసిన ఇవన్నీ కూడా మాకొద్దు కేవలం జీతాలు పెంచండి అంటూ ఆశా వర్కర్లు ఆందోళన చేపడుతున్నారట. దీంతో రైళ్లల్లో బస్సులలో కూడా విజయవాడకు బయలుదేరిన ఆశా వర్కర్లను రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో ఉండే వారందరినీ కూడా పోలీసులు వెతికి మరి ఇంటికి పంపిస్తున్నారట.
మరొకవైపు విజయవాడ ధర్నా చౌకలో ఆ శా వర్కర్ల సైతం ఆందోళన చేపడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 1700 మంది వరకు ఇక్కడ పాల్గొన్నారట . రిటైర్డ్మెంట్ వయసుకు సంబంధించిన విషయాలను సైతం విడుదల చేయాలని ఆన్లైన్ పనులకు ఇచ్చిన మొబైల్స్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మార్చాలి అంటూ.. అలాగే రికార్డు బుక్కులకు అవసరమయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలంటూ తెలుపుతున్నారట. దీంతో ఒక్కసారిగా ఏపీ అంతట ఉద్రిక్తత నెలకొంది ఆశా వర్కర్ల కదలికలను డ్రోన్లు, ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులు మరి కనుక్కొని వారిని హెచ్చరిస్తున్నారట. అయితే ఆశ వర్కర్ల విషయంపై సీఎం చంద్రబాబు కు ఇది కట్టి షాక్ అని చెప్పవచ్చు.