
రిజిస్ట్రేషన్ జరిగిన ప్రభుత్వ భూములను వివిధ మార్గాలలో సైతం గుర్తిస్తున్నారట. ఒకవేళ ప్రజలకు ఎవరికైనా సరే ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా తెలిస్తే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు అంటూ తెలియజేశారు. ఈ ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి కలెక్టర్స్ సైతం రిజిస్ట్రేషన్ ని రద్దు చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఏపీ ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్ చట్టం 1908 రూల్ 26K..i ప్రకారం కలెక్టర్లు ఈ భూములను దొంగ రిజిస్ట్రేషన్ కింద రద్దు చేయవచ్చట.
ప్రభుత్వ భూమి అని కలెక్టర్ కూడా నిర్ధారించుకున్న తరువాతే తాసిల్దార్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందించి అలాగే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ఈ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ రద్దు పత్రాలను సమర్పించాల్సి ఉంటుందట.ఆ తరువాతే రద్దు ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తారట. ఒకవేళ ఆ భూములు నిర్మాణాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన తర్వాత వాటిని ప్రభుత్వ భూములలో చేర్చడం జరుగుతుందట.. ఒకవేళ అంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళితే.. వారి రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తర్వాతే కోర్టులో కౌంటర్ వేయాలని నిర్ణయించుకున్నదట.. ఇందుకోసం 26 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లకు ప్రభుత్వం ఒక ఫార్మాట్ ను కూడా పంపించారట. కలెక్టర్లు ఆయా జిల్లాలలో ఇలా అక్రమంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఫార్మాట్లో పంపించాల్సి ఉంటుందట.