ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటిర్లకు సంబంధించి పదివేల రూపాయలు ఇస్తామంటూ కీలకమైన హామీ ఇచ్చి వారి చేత ఓట్లు వేయించుకున్నారు.తీర అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతూ ఉన్న వారి ఊసే పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం వీరిని రెన్యువల్ చేయలేదంటూ వైసీపీ ప్రభుత్వం మీదికి తోసేస్తోంది కూటమి ప్రభుత్వం. అమలులో లేని వాలంటిరలను తాము ఎలా కొనసాగిస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అయితే ఇప్పుడు వాలంటిరీల కొనసాగింపు పై క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.


వాలంటరీల వ్యవస్థ ఇప్పుడు మరొకసారి చర్చనీయంశంగా మారడంతో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పలు వ్యాఖ్యలతో స్పష్టత ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం హయాంలోనే 2023 ఆగస్టు నుంచి వాలంటరీ వ్యవస్థ ఎవరు కూడా రెన్యువల్ చేయలేదని.. అలా లేని వారిని విధులలోకి తీసుకోలేమంటూ తెలియజేశారు. అయితే ఈ విషయంపై గతంలో శాసనమండలిలో చర్చనీ అంశంకి రాగా వైసిపి నేత బొత్స మాట్లాడుతూ వాలంటిరీల జీవో ఇచ్చి ఉండకపోతేనేమి రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ ప్రశ్నించడం జరిగింది.. ఎన్నికలలో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ..? వారికి కచ్చితంగా 10 వేల రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారట.

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కూడా తాను వాలంటీరీలను తీసివేయనని వారికి ఇంకా జీతం పెంచే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. కానీ ఇప్పటివరకు వారి ఊసే ఎత్తలేదు.. అలాగే సర్పంచ్ సంఘాల నేతలు కూడా వాలంటిరీల అంశం ప్రస్తావించిన సమయంలో పలకీలకమైన వ్యాఖ్యలు చేశారట. ముఖ్యంగా వాలంటిరీల వ్యవస్థ లేదని తెలిపారు. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతోనే ప్రతినెలా కూడా ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే ఇక వాలంటిరీలను విధులలోకి తీసుకొని అవకాశం కనిపించడం లేదట. కానీ వాలంటీర్లు మాత్రం నిరసనలు తెలుపుతూ ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: