
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లడం లేదు. బలం ఎక్కువగా ఉన్న మండలికి వెళ్తున్నారు. దీంతో వైసిపి ఎమ్మెల్సీ లతో మండలి కిటకిట లాడుతోంది. అదే సమయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని.. ప్రశ్నలతో ముప్పతిప్పలు పెడుతున్నారు వైసిపి సభ్యులు. అయితే వైసిపి వేసిన స్కెచ్ కు తాజాగా ఏపీ ప్రభుత్వం ఇరుక్కుపోయింది. ఫ్రీ బస్సు పైన వైసిపి సభ్యులు పీవీ సూర్యనారాయణ రాజు ప్రశ్నించారు.
ఉచిత బస్సు పథకం ప్రవేశపెడితే మహిళలు అన్నవరం నుంచి తిరుపతికి ఉచితంగా వెళ్లాలని ఎదురుచూస్తున్నారని సెటైరికల్ గా ప్రశ్నించారు పివి సూర్యనారాయణ రాజు. అయితే దీనిపై ఏపీ మంత్రి సంధ్యారాణి స్పందించడం జరిగింది. తిరుపతి కాదు అన్నవరం కాదు ఎక్కడికి వెళ్ళేది లేదని ఆమె సమాధానమిచ్చారు. ఉచిత బస్సు కేవలం జిల్లాలో వరకు మాత్రమే అంటూ బాంబు పేల్చారు మంత్రి సంధ్యారాణి.
ఏ జిల్లాలోని మహిళలకు ఆ జిల్లాలోని ఆర్టీసీ బస్సు ఉచితంగా అందించబోతున్నట్లు వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణం ఉండబోదని ఆమె చెప్పకనే చెప్పారు. జిల్లాల వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే చెప్పినట్లు గుర్తు చేశారు. దీంతో వైసిపి పార్టీ సభ్యులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లినా... ఉచితంగానే బస్సు సౌకర్యం ఉంది.