
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా మార్కాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగానే.... రేపు ఉదయం 10 30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మార్కాపురానికి వెళ్లనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు.
ఇక రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కూడా ఉండనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. ఈ తరుణంలోనే.... డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. దీనిపై ఎక్కడ రివీల్ చేయలేదు. రేపు సర్ ఫ్రైజ్ ఇవ్వనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు.
మహిళా దినోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక రేపు సాయంత్రం 4.30 గంటలకి మార్కాపురం నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి తిరిగి రానున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు ఖరారు అయింది. అయితే... డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని ప్రారంభించే ఏపీ సర్కార్.. ఉచిత ఆర్టీసీ బస్సు విషయంలో కోతలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేయనున్నారట. ఈ మేరకు నిన్న శాసన మండలిలో ఏపీ మంత్రి సంధ్యా రాణి కూడా ప్రకటించారు. జిల్లాలలో ఉండే మహిళలకు ఆ జిల్లాల వరకు మాత్రమే... ఉచిత ప్రయాణం కలిపించేలా... నిర్ణయం తీసుకోనున్నట్లు ఏపీ మంత్రి సంధ్యా రాణి వెల్లడించారు.